దిగ్విజయ్ సింగ్, టీవి యాంకర్ అమృతా రాయ్ మధ్య వున్న ఎఫైర్ సడన్ గా బయటపడడం, అమృతని పెళ్ళి చేసుకోబోతున్నానని దిగ్విజయ్ ప్రకటించడం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేవిధంగా తన కంప్యూటర్ని, ఈ మెయిల్‌నీ ఎవరో హ్యాక్ చేశారని అమృత వాపోయింది. దిగ్విజయ్, తాను సన్నిహితంగా వున్న ఫొటోలు నా కంప్యూటర్లో, ఈ మెయిల్లో వున్నాయి. వాటిని ఎవరో సంపాదించి ఇంటర్నెట్‌లో లీక్ చేశారని చెప్పింది. తాజాగా ఆమె హ్యాకింగ్ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమృతా రాయ్ గురువారం తన జీ మెయిల్, ఫెస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఫిర్యాదు చేసిందని, క్రైం బ్రాంచ్ ఐటి యాక్ట్ కింద్ కేసును నమోదు చేశారని ఢిల్లీ క్రై బ్రాంచ్ పోలీసు అధికారులు చెప్పారు.
By
No comments:
Post a Comment